Sri Naradapuranam-3    Chapters    Last Page

త్త్రిం శత్తమో%ధ్యాయః = ముప్పది యవ అధ్యాయము

కాష్ఠీలా చరితమ్‌


భార్యాయాస్తద్వచ శ్శ్రుత్వా రాక్షస్యా ధర్మసంమితమ్‌ | పృష్ఠాత్కరేణు రూపిణ్యా సకన్యో
వాతరిద్ద్విజః 1
అవతీర్ణే ద్విజే సాభూ త్సురూపా ప్రమదా పునః | క్షపా చరీ క్షపానాధవక్త్రా పీనోన్నతస్త నీ 2
సా కుమారీ తతః ప్రాప్య నగరం స్వపితుశ్శుభమ్‌ | బాహ్య రక్షాస్థితం ప్రాప్తం పురపాల మువాచ హ 3
గచ్ఛ త్వం నృపతేః పార్వ్శం పితుర్మమ పురాధిప | బ్రూహి మాం సమను పాప్తాం రత్నశాలాపురా హృతామ్‌ 4
రత్నావలి రత్నభూతా నుద్యుమ్నస్య హహీక్షితుః | తల్పస్థా రక్షసా రాత్రౌ స్వపురస్థా హృతా ద్విజ 5
పునస్సా సమనుప్రాప్తా జీవమానాక్షతా పితుః సమాశ్వసిహి శోకం త్వం మాకృధా మత్కృతే క్వచిత్‌ 6
అవిప్లుతాస్మి రాజేన్ద్ర గాంగా అప ఇవామలాః | తవ కీర్తి కరీ తద్వ న్మాతుస్సౌశీల్యసూచికా 7
తత్కుమారీవచశ్శ్రుత్వా పురనాలస్త్వరాన్వితః | సు బాహురితి విఖ్యాతః ప్రాప్తస్సుద్యుమ్న సన్నిధౌ 8
కృతప్రణామః సంపృష్టః ప్రాహ రాజాన మాదరాత్‌ | రాజన్నుపాగతా నష్టా దహితా తవ మానద9
రత్నావలీతి విఖ్యాతా సస్త్రీకద్విజ సంయుతా | పురబాహ్యా స్థితా దృష్ట్వా మయా జ్ఞాతా నచాభవత్‌ 10
తయాహం ప్రేరితః ప్రాగాం త్వాం విజ్ఞాపయితుం ప్రభో | అ విప్లుతాహం వదతి మాం జానాతు సమాగతామ్‌ 11
పితరం మమ సత్కృత్యైద నాత్ర కార్యా విచారణా తదద్భుతం వచః శ్రుత్వా పురపాలస్య తత్‌క్షణాత్‌ 12
సామాత్యః సకళత్రస్తు సద్విజో నిర్య¸° నృపః | స తు గత్వా పురాద్బాహ్యే గాంగాతీరే వ్యవస్థితామ్‌ 13
అపశ్యద్భాస్కరాకారం సస్త్రీక ద్విజసంయుతామ్‌ | సహజేనైవ పేషేణ భూషితాం భూషణప్రియామ్‌ 14
అవ్లూన కుసుమప్రఖ్యాం తప్తకాంచన సుప్రభామ్‌ దూరాద్దృష్ట్వాంతికం గత్వా పర్యష్వజత భూపతిః 15
పితరం సాసి సంహృష్టా సమాశ్లిష్య ననామ హ తతశ్య | మాత్రా సంగమ్య హృష్టయా హర్షితాంతరా 16
ప్రాహ వాక్యం విశాలాక్షీ సంభోధ్య పితరం నృపమ్‌ | సుప్తాహం రత్నాశాలాయం సఖీభిః పరివారితా 17
ఉదక్‌ కృత్వా శిరస్తాత ధౌతాంఘ్రిర్మంచ కోపరి | చింతయన్తీ భర్తృయోగం నిశీధే రక్షసా హృతా 18
సమాం గృహీత్వా స్వపురం ప్రాగాదర్ణవగే గిరౌ | నానారత్నమయే తత్ర గుహాయాం స్థాపితా హ్యహమ్‌ 19
స తత్రోద్వహనోపాయం చింతయాంతర్వ్యవస్థితః | తస్య భార్యాత్వియం సుభ్రూః యా తిష్టతి సుమధ్యమా 20
బిభ్రతీ మానుషం రూపం రాక్షసీ రాక్షస ప్రియా | అనయా బుద్ధియోగేన శక్త్యా శక్రస్య భూపతే21
ఘాతితో విప్రహస్తేన క్రూరకర్మా పతిః స్వకః | పురైవ మమ తం శైలం ప్రాప్తో దేవేన భూసురః 22
ఇయం తు రాక్షసీ దృష్ట్వా పతిస్వం ధర్మదూషకం | విప్రేణ సంవిదం కృత్వా దాంపత్యే నిజకర్మణా 23
రూపేణాప్యస్య సంముగ్ధా ఘాతయామాస రాక్షసం | ఏవం కృత్వా పతిం విప్రం హస్తినీ రూపధారిణీ 24
గృహీత్వా వాస్తుకం వ్తిత్తం పృష్‌ఠ మారోస్య మామపి | సమాయాత్రాత భూపాల మామత్తుం తవ మందిరమ్‌ 25
అనయా రక్షితా రాజన్‌ రాక్షస్యా రాక్షసాత్తతః | తస్మాదిమం పూసయస్వ సత్కృత్యాగ్రజసంయుతామ్‌ 26
అస్యా ఏవామ మత్యా మాం దేహ్యసై#్మ బ్రాహ్మణాయ హి | అనేనైకాసర గతా జాతా భర్తా సమే భవత్‌ 27
యేనై కాసనగా నారీ భ##వేధ్భర్తా స ఏవహి | నాన్య ఇత్థం పురాణషు శ్రూయతే హ్యగమేష్వపి 28
అస్యా పృష్ఠే నివిష్టాహం ప్రీత్యా ద్విజన్మనా | ధర్మతస్తేన మద్భర్తా భ##వేదేషా మతిర్మమ 29
తస్మాదిమాం సాంత్వయిత్వా శాస్త్రాగమ విధినతః | దేహి విప్రాయ మాం తాత పతిమన్యం వృణ న చ 30
తచ్ఛృత్వా దుహితుర్వాక్యం సుద్యుమ్నో భూపతిస్తదా | సాంత్వయామాస తన్వంగీం రాక్షసీం ప్రశ్రయానతః. 31
సుతైషా ధర్మభీతా మే త్వామేవ శరణం గతా | యదర్ధం నిహతః కాంతః త్వయా పూర్వతరః పతిః 32
త్వదధీనా తతో భ##ద్రే జాతేయం మత్సుతా కిల | ఇమమిచ్ఛతి భర్తారం యోయం భర్తా కృతస్త్వయా 33
మయా ప్రణామదానాభ్యాం యాచితా త్వం నిశాచరి | అనుమోదయ సాహాయ్యే సుతాం మమ సులోచనే 34
త్వద్వాక్యాత్‌ భవతు ప్రేష్య మత్సుతా బ్రాహ్మణస్యతు | సాపత్న భావం త్యక్త్వా తు సుతాం మే పరిపాలయ 35
సుతాయా మమ భార్యాయా మద్బలస్య జనస్య చ | పురస్య నిషయస్యాపి స్వామినీ త్వం నసంశయః. 36
తవ వాక్యే స్థితాహ్యేషా సదైవాపి భవిష్యతి | ఏతచ్ఛృత్వాతు వచనం సుద్యుమ్నస్య నిశాచరీ 37
అన్వమోదత శుద్ధేన చేతసా సహచారిణీ | ఉవాచ చ ధరాపాలం ప్రదానాయ కృతోద్యమమ్‌ 38
కాష్ఠీల పలికెను : భార్యయగు రాక్షసి పలికిన ధర్మ సంయుతమగు ఆ మాటలను విని రాజకుమారితో యేనుగు మూపు నుండి క్రిందికి దిగెను. బ్రాహ్మణుడు దిగిన వెంటనే ఆయేనుగు మరల చక్కని రూపముగల యువతిగా మారెను. ఆ రాక్షసి చంద్రముఖి బాగుగా బలిసిన ఎత్తుగా యున్న న్తనములు కలదాయెను. రాజకుమారి కూడా తన తండ్రి నగరమును చేరి నగర రక్షకుని గూర్చి ఇట్లు పలికెను. నీవు నా తండ్రి వద్దకు వెళ్ళుము. పూర్వము అపహరించబడిన రత్నావళీదేవి వచ్చినదని తెలుపుము. నేను శయ్యపై నిద్రించుచుండగా రాత్రి యందు రాక్షసునిచే అపహరించబడితిని. మరల నేను సురక్షితముగా ప్రాణములతో చేరితిని. నీవు ఊరడిల్లుము. నాకొరకు దుఃఖించుకుము. గంగాజలము వలె పవిత్రముగా నుంటిని నీకు కీర్తిని తల్లి సౌశీల్యమును తెలుపుదాననుగా నుంటిని అని తెలుపుము. ఆ రాజకుమారి మాటలను విని సుబాహువను పేరుగల పురపాలకుడు శీఘ్రముగా సుద్యుమ్నమహారాజు సమీపమునకు చేరెను. నమస్కరించి రాజుచే కుశలమడుగబడి ఆదరముతో రాజుతో ఇట్లు పలికెను. ఓ రాజా! పూర్వము అపహరించబడిన నీపుత్రిక రత్నావలీ ఒక యువతితో బ్రహ్మణునితో మరల వచ్చినది. నగరము వెలుపల నిలిచినది. తెలుపటకు వచ్చితిని. పాపరహితనుగా వచ్చితినని తెలియుము అని తెలుపుచున్నది. నా తండ్రి సుకృతవంతుడని చెప్పుచున్నది. ఇట్లు పురపాలకుడు చెప్పిన మాటలను వినిన వెంటనే మహారాజు ఆమాత్యసహితముగా భార్యా సహితుడై బ్రాహ్మణులతో కలిసి నగరము నుండి బయలుదేరెను. ఆ మహారాజు ఆమాత్యసహితముగా భార్యా సహితుడై బ్రాహ్మణులతో కలిసి నగరము నుండి బయలుదేరెను. ఆ మహారాజు నగరము వెలుపలకు వెళ్ళి గంగాతీరమున నిలిచియున్న భాస్కర సన్నిభ ద్విజ స్త్రీసంయుత యగు రత్నావలిని చూచెను. ఆ కుమారి సహజ భూషణములచే భూషించబడిన భూషణప్రియ, వాడని పూవువలెనున్న, తప్తకాంచన సన్నిభయగు రాకుమారిని చూచెను. దూరము నుండి చూచి సమీపించి రాజు పుత్రికను ఆలింగనము చేసుకొనెను. రత్నావలి కూడా సంతోషముచే ఆలింగనము చేసుకొని తండ్రికి నమస్కరించెను. తరువాత సంతోషముతో నున్న తల్లిని సంతోషముతో కలిసి తండ్రితో ఇట్లు పలికెను. ఓ తండ్రీ! నేను చెలులతో కలిసి రత్నశాల యందు నిదురించి యుంటిని. ఉత్తర దిక్కున శిరము నుండి పాదప్రక్షాళనము గావించక మంచముపై పరుండి వివాహమును గూర్చి ఆలోచించుచుండగా నిశీధకాలమున రాక్షసుడహరించెను. ఆ రాక్షసుడు నన్ను తీసుకొని సముద్ర మధ్యభాగముననున్న పర్వతగుహలోనున్న తన ఇంటికి చేర్చేను. నానారత్నమయమగు గుహలో నన్నుంచెను. అచట నన్ను వివాహమాడు నుపాయమునాలోచించు చుండెను. ఆ రాక్షసుని భార్యయే ఈ సుందరాంగి. ఈ రాక్షసి అంతకు పూర్వమే దైవయోగమున అటకు చేరిన ఈ బ్రాహ్మణునిచే తన భర్తయగు రాక్షసుని చంపించెను. ఇంద్రుని శక్తిని బ్రాహ్మణునకిచ్చి ఆశక్తిచే రాక్షసుని సంహరింపచేసెను. ఈ రాక్షసి ధర్మ దూషకుడగు తన భర్తను చూచి ఈ బ్రాహ్మణునిచే సంవాదము చేసి, బ్రాహ్మణుని రూపమును చూచి మోహించి తన భర్తను సంహరింప చేసి తాను వివాహమాడెను. ఇట్లు బ్రాహ్మణుని భర్తగా చేసుకొని ఆడయేనుగు రూపమును ధరించి గృహములోని సంపదనంతా తీసుకొని నన్ను కూడా తను మూపుపై కూర్చోబెట్టి నన్ను అప్పగించుటకు నీ మందిరమునకు వచ్చెను. ఇట్లు ఆ రాక్షసుని నుండి నన్ను ఈమె కాపాడెను. కావున బ్రాహ్మణునితో ఈ రాక్షసిని చక్కగా సత్కరించి పూజించవలయును. ఈమె అనుమతిని పొంది నన్ను ఈ బ్రాహ్మణునకర్పించుము. నేను ఇంతనితో కలిసి ఏకాసనమున కూర్చొని వచ్చితిని కావున ఇతను నాకు భర్త ఆయెను. స్త్రీ ఏ పురుషునితో ఏకాసనగతయగునో అతనే ఆమెకు భర్తయగును. ఇతరుడు కాజాలడని పురాణములలో చెప్పబడియున్నవి. నేను బ్రాహ్మణునితో కలిసి ఈమె మూపుపై ప్రీతితో కూర్చొంటిని. కావున ధర్మానుసారముగా ఇతనే నా భర్తయని నాయభిప్రాయము. కావున ఈమెను ఓదార్చి శాస్త్రాగమ విధానముననుసరించి ఈ బ్రాహ్మణునికి నన్ను అర్పించుము. నేను ఇతరుని భర్తగా వరించజాలను. అంతట సుద్యుమ్నమహారాజు పుత్రిక మాటలను విని సుందరాంగియగు రాక్షస యువతిని వినయముచే నమ్రుడై ఓదార్చసాగెను. ధర్మభీతయగు నా పుత్రిక నిన్నే శరణు పొందినది. నీవు మొదటి పతిని చంపిన కారణముతోనే ఈమె నా పుత్రిక నిన్ను ఆశ్రయించి యున్నది. నీవు భర్తగా చేసుకొనిన ఇతనిని ఈమె భర్తగా కోరుచున్నది. నేను నమస్కరించి నిన్ను యాచించుచున్నాను. కావున నీవు అంగీకరించి నా పుత్రిక సహాయకురాలిగా స్వీకరించుము. నీమాటచే నాపుత్రిక ఈ విప్రునికి భార్యయగుగాక. సవతి భావమును విడిచి నా పుత్రికను కాపాడుము. నీవు నా పుత్రికకు నా భార్యకు నా సైన్యమునకు, ప్రజలకు, నగరమునకు, రాజ్యమునకు, నాకు నీవే యజమానురాలవు కమ్ము. ఈ నా పుత్రిక యెప్పుడు నీ మాట యందు నిలిచియుండును. ఇట్లు పలికి సుద్యుమ్న మహారాజు మాటలను వినిన రాక్షసి పరిశుద్ధమగు మనసుచే ఆమోదించి కన్యాదానమును చేయుటకు సిద్ధముగా నున్న మహారాజుతో ఇట్లు పలికెను.
యదర్ధం ప్రణతస్త్వం మాం సద్భావేన నృపోత్తమ | తస్మాద్ద్వితీయా భార్యేయం భవత్వస్య ద్విజన్మనః 39
అహంచ భవతా పూజ్యా కృత్వార్చాం దేవమందిరే | సర్యైశ్చ నాగరైః సార్ధం ఫల్గునే ధవళే దళే 40
సప్తాహ ముత్సవః కార్యో హ్యష్టమ్యా ఆచతుర్దశీమ్‌ | నటనర్తక యుక్తేన గీతవాద్యేన భూరిణా 41
మైరేయమాంసరక్తాది బలిభిశ్చాపి పూజయా | ఏవం ప్రకుర్వతే తుభ్యం సదా క్షేమకరీ హ్యహమ్‌ 42
భ##వేయం నృపశార్దూల స్వం వచః ప్రతిపాలయ | తచ్ఛృత్వా వచనం తస్యా సుద్యమ్నో నృపతిస్తదా 43
అంగీచకార తత్సర్వం యదుక్తం ప్రీతయా తయా | ప్రతిపన్నే తు వచసి రాజ్ఞా తుష్టా తు రాక్షసీ 44
ఉవాచ బ్రాహ్మనం ప్రేవ్ణూ కురు భార్యామిమామపి | రాజకన్యాం ద్విజశ్రేష్ట గృహ్యోక్త విధినా శుభామ్‌ 45
ఈర్ష్యాం త్యక్త్వా విశాలాక్ష్యా భవామ్యేషా సహోదరీ | రాక్షస్యా వచనేనేహ పరిణీయ నృపాత్మజామ్‌ 46
బహు విత్తయుతాం విప్రో మహోదయపురం య¸° | ఆరుహ్య కరిణీ రూపాం రాక్షసీం క్షణమాత్రతః 47
తతో మయా శ్రుతం దేవి భర్తాతే సముపాగతః | ధనరత్న సమాయుక్తో భార్యాద్వయ సమన్వితః 48
బహుశో భర్త్సితా రూక్షైః వచనైర్మర్మ భేదిభిః
కధం యాస్యసి భర్తారం ధనలుబ్ధే శ్రియావృతమ్‌ | యస్త్వయా నిర్ధనః పూర్వం పరిత్యక్తః సుదీనవత్‌ 50
చంచలానీహ విత్తాని పిత్ర్యాణి కిల యోషితాం | కాంతార్జితాని సుభ##గే స్థిరాణీతి నిగద్యతే 51
పరుషైర్వచనైర్యస్తుక్షిప్తస్తద్భాషణం కధమ్‌ | భవిష్యతి ప్రవేశోపి దుష్కరస్తన్య వేశ్మని 52
గతాయా అపి తే తత్ర శయనం పతినా సహ | భవిష్యతి దురాచారే సుఖదం న కదాచన 53
లోకాపవాదాద్యది చేత్‌ గ్రహష్యతి పతి స్తవ | త్వాం స్నేహహీన చిత్తస్తు స కదాచిన్మిలిష్యతి 54
నేదృశం దుఃఖదం కించిత్‌ యాదృశం దూరచిత్తయోః | దంపత్యోర్మిలనం లోకే వైకల్యకరణం మహత్‌ 55
ఏవం బహువిధా వాచః శృణ్వానా బంధుభాషితాః | అధోముఖ్యశ్రుపూర్ణాక్షీ బభూవాహం సుదుఃఖితా 56
చేతసా చింతయం చాహం పూర్వలోభేన ముహ్యతీ | న దత్తం కంకణం పాణర్న దత్తం కటి సూత్రకమ్‌ 57
స చాపి నూపుర దత్తే యేన తుష్టిం ప్రజేత్పతిః | ధన జీవితయోః స్వామీ భర్తా లోకేషు గీయతే 58
తన్మయాపహృతం విత్తం భవిత్రీ కా గతిర్మమ | కధం యాస్యామి తద్వేశ్మ కధం సంభాషయే పునః 59
యో మయా దుష్టయా త్యక్తః స ప్రత్యేతి కధం హి మాం | ఏవం విచింతయే యావత్‌ యావత్‌ హృదయేన విదూయతా 60
వేష్టితా బంధు వర్గేణ తావద్దోలా సమాగతా | ఛత్రేణ శశివర్ణేన శోభమానా సుకోమలా 61
ఆస్తృతా రాంకవైః పీనైః పురుషైర్విధృతాంసకైః | తే సమాగత్య పురుషాః ప్రోచుర్మామసకృచ్ఛుభే 62
ఆకారితాసి పత్యా తే ప్రజ శీఘ్రం ముదాన్వితా | ధనరత్నయుతో భర్తా సద్విభార్యః సమాగతః 63
ప్రవిష్టమాత్రేణ గృహే త్వామానేతుం వరాననే | ప్రేషితాః సత్వరం పత్యా సంస్థితాం పితృవేశ్మని 64
తతో హం వ్రీడితా దేవి భర్తుస్త ద్వీక్ష్య చేష్టితమ్‌ | నైవోత్తరమదాం తేభ్యః కించిన్మౌనం సమాస్థితా 65
తతో హం బంధువర్గేణ భూయోభూయః ప్రబోధితా | ఆహూతా స్వామినా గచ్ఛ సమ్మానేన తదంచికమ్‌ 66
స్వామినా కారితా పత్నీ యా నయాతి తదంతికమ్‌ | సా తు ధ్వాంక్షీ భ##వేత్పుత్రి జన్మాని దశ పంచ చ 67
ఏవముక్త్యా సమాశ్వాస్య మా ంగృహీత్వా త్వరాన్వితాః | దోలామారోస్య గచ్ఛేతి ప్రోచుః స్నిగ్ధాః మహుర్ముహః 68
తతస్తే పురుషా దోలాం నిధాయాంసేషు సత్వరమ్‌ | జగ్ముర్మహోదయపురం యత్ర తిష్ఠతి మే పతిః 69
దృష్టం మయా గృహ తస్య సర్వతః కాంచనావృతమ్‌ | ఆసనీయైశ్చ భోజ్యైశ్చ ధనైర్వసై#్త్రర్యుతం తతః 70
అధ సా రాక్షసీ దేవీ సా చాపి నృపనందినీ | ప్రీత్యా చ భక్త్యా కురుతాం ప్రణతిం మమ సుందరి 71
తతస్తాభ్యామహం ప్రేవ్ణూ యధార్ధమభిపూజితా | భర్తృవాక్యేన సంప్రీతా స్నాత్వాభ్రాజం తథాదృతా 72
తతో స్తసమయాత్‌ పశ్చాత్‌ భర్తా చాహూయ సత్వరం | పరిష్వజ్య చిరం దోర్భ్యాం పర్యంకే సంస్యవేశయత్‌ 73
తతో నిశాచరీం రాజపుత్రీం చాహూయ సో బ్రవీత్‌
ఓ రాజోత్తమా? నీవు పరిశుద్ధమైన భావముచే నన్ను ఆశ్రయించితివి కావున ఈ రాకుమారి ఈ బ్రాహ్మణునకు రెండవ భార్యయగును. నన్ను చక్కగా పూజించవలయును. మొదట దేవాలయమున ఫాల్గున శుద్ధ అష్టమినుండి చతుర్దశి వరకు ఏడు దినములు ఉత్సవమును జరుపవలయును. నటులతో, నర్తకులతో గొప్ప గీతవాద్యములతో మైరేయమాంసరక్తాదిబలులతో చక్కగా పూజను గావించుము. ఇట్లు పూజించు నీకు నేనెప్పుడూ రక్షకురాలిగా నుందును. నీవు నీ మాటను పాటించుము. ఇట్లు పలికిని రాక్షసి మాటలను వినిన సుద్యుమ్న మహారాజు ఆమె ప్రీతితో పలికిన మాటలను సంతోషముగా నంగీకరించెను. రాజు అంగీకరించగనే రాక్షసి సంతోషించెను. బ్రాహ్మణునితో ఈ రాజుకుమారిని కూడా భార్యగా చేసుకొనుము అని పలికెను. నేను ఈర్ష్యను విడిచి ఈమెతో యుందును. ఈమె నాకు సోదరి కాగలదు. ఇట్లు రాక్షసి మాటతో రాజపుత్రికను వివాహమాడి బహుధనరాశులతో కరిణీ రూపమున నున్న రాక్షసినధిరోహించి మహాదయ పురమునకు వెళ్ళెను. అంతట నేను నీ భర్త బహురత్నములను తీసుకొని ఇద్దరు భార్యలతో వచ్చెననవి వింటిని. అంతట నేను బంధువర్గముతో తలిదండ్రులతో సఖీగణముతో కలిసి మర్మములను భేదించు పరుషవాక్యములచే దూషించబడితిని. ధనము యందు ఆశకల దానా? ఇప్పుడు సంపదలు చేకూరిన భర్తను ఎట్లు సమీపించెదవు? పూర్వము ధనహీడని నీవే విడిచితివికదా? స్త్రీలకు తండ్రి సంపదలు చంచలములు. భర్త సంపాదించిన సంపదలు స్థిరములని చెప్పబడును. పూర్వము పరుష పదజాలముచే నిందించి ఇపుడెట్లు మాటలాడగలవు? నీకు అతని ఇంటిలో ప్రవేశము కూడా దుర్లభము కాగలదు. ఒకవేళ వెళ్ళననూ అచట నీవు భర్తతో శయనించుట దురాచారముగల నీకు సుఖప్రదము కాజాలదు. లోకాపవాద భయముచే నీ భర్త నన్ను స్వీకరించిననూ నీ మీద స్నేహశూన్యమగు మనసు కలవాడు కావున నీతో కలియజాలడు. స్నేహ శూన్యమగు మనసు కల దంపతుల కలయిక కంటె మించిన దుఃఖప్రదము మనోవైకల్యకారి మరియొక్కటి యుండజాలదు. ఇట్లు పలు విధములగు మాటలను వినిన నేను అధోముఖినై, నీరు నిండిన కనులతో చాలా దుఃఖింతిచితిని. నేను మొదట నా చేతి కంకణము నీయకపోతిని. కటి సూత్రమును నూపురములను ఈయజాలకపోతిని. అట్లు ఇచ్చినచో నా పతి సంతోషించి యుండెడివాడు. పతియే భార్యధనమునకు జీవితమునకు స్వామియని లోకమున చెప్పబడుచున్నది. నేను అట్టి ధనమును అపహరించి వచ్చితిని. ఇప్పుడు నాకేదిగతి? ఇపుడు నేనతని ఇంటికి ఎట్టు వెళ్ళగలను? ఎట్లు మాటలాడగలను? నన్నెట్లు విశ్వసించును? ఇట్లు పరితప్త మనసుచే చింతించుచు బంధువర్గ పరివేష్టితనై యుంటిని. ఇంతలో తెల్లని ఛత్రముతో అలకంరించబడి) సుకోమలము బలిష్ఠులగు పురుషులచే మోయబమడుచున్న పల్లకి అచటికి వచ్చెను. ఆ పురుషులొచ్చి నాతోఇట్లు పలికిరి. నీ భర్త నిన్ను ఆహ్వానించుచున్నాడు. సంతోషముచే త్వరగా రమ్ము. నీ భర్త ధనరాశులతో రత్నరాశులతో ఇద్దురు భార్యలతో వచ్చియున్నాడు. గృహమున ప్రవేశించిన వెంటనే తండ్రి ఇంటిలో నున్న నిన్ను తొడ్కిని వచ్చుటకు మమ్ములను పంపెను. అ
. అంత నేను సిగ్గుపడి నా పతి చేసిన పనిని చూచి ఏ సమాధానమును చెప్పక కొంతసేపు మౌనముగా నుంటిని. అంతట నన్ను బంధువర్గము మాటిమాటికి బోధించినది. సమ్మానముతో భర్త ఆహ్వానించినపుడు ఆతని వద్దకు వెళ్ళవలయును. భర్త పిలిచినపుడు ఆతని వద్దకు వెళ్ళని భార్య పదిహెను జన్మలు ఆడకాకిగా పుట్టును. ఇట్లు బోధించి నన్నోదార్చి నన్ను తీసుకొని త్వరగా పల్లకిలో కూర్చండబెట్టి వెళ్ళుము వెళ్ళుము అని మాటిమాటికి పలికిరి. అంతట ఆ పురుషులు పల్లకిని భుజములపై నిడుకొని వేగముగా నా భర్త నివసించియున్న మహోదయ పురమునకు గొనిపోయరి. నేను నా భర్త గృహమును అంతటా బంగారముతో నిండియున్న దానిని, ఉత్తమాసనములతో, భోజ్యములతో, ధనములతో, వస్త్రములచే కూడియున్న దానిని, చూచితిని. అంతట ఆ రాక్షసీదేవి, రాకుమారి ప్రీతితో నున్న పూజించిరి. భర్త వాక్యముతో నేను ప్రీతి చెంది ఆదరముతో స్నానముచేసి భుజించితిని. సూర్యాస్తమయము తరువాత నా భర్త నన్ను పిలిచి చాలసేపు ఆలింగనము చేసుకొని పర్యంకమున కూర్చోబెట్టెను. తరువాత రాక్షసిని రాజపుత్రిని పిలిచి నా భర్త ఇట్లు పలికెను.
భక్యా యువాభ్యాం కర్తవ్యం అస్యాశ్చరణ సేవనమ్‌ 74
ఇయం ప్రాక్కాలికీ భార్య జ్యేష్ఠా చ యువయోర్ధ్రవమ్‌ | పత్యుర్వాక్యాత్తతస్తాభ్యాం గృహీతౌ చరణౌ మమ 75
సాపత్నభావజామీర్ష్యాం పరిత్యజ్య సులోచనే | తతఃప్రేష్యాన్‌ సమాహూయ భర్తా మే వాక్యమబ్రవీత్‌ 76
యత్కించిద్రక్షసః పార్శ్వాత్‌ మయా ప్రాప్తం పురా వసు | సుతాముద్వహతో రాజ్ఞ యచ్ఛ లబ్ధం మయాఖిలమ్‌ 77
తత్సర్యం భక్తిభావేన సమానయత మా చిరం | ఇయం హి స్వామినీ ప్రాప్తా తస్య విత్తస్య కింకరాః 78
తద్వాక్యాత్సహసాప్రేషై#్యః సమానీతం ధనం శుభే | భర్తా సమర్పయామాస ప్రీత్యాయక్తోభిలం తదా 79
సత్కృత్య భూషణౖర్వఃసై#్త్ర అవ్యలీకేన చేతసా | ఉభయోస్తత్ర పశ్యంత్యోః రాక్షసీరాజకన్యయోః 80
పర్యంకస్థాం పరిష్వజ్య మాం చచుంబాధరే శుభే | తద్దృష్ఠ్వా చాద్భుతం భర్తుర్దేహవిత్తసమర్పణమ్‌ 81
ఉల్లాసకరణ వాక్యం కరేణ కుచపీడనమ్‌ | ఛిన్నా గైరివఖ డ్గేన గతాః ప్రాణా మమా భవన్‌

తతో
%హం యమనిర్దిష్టాం ప్రాప్తా నరకయాతనామ్‌ | తామతీత్య సుదుఃఖార్తా కాష్ఠీలా చాభవం శుభే 83
యాస్యామి పునరేవాహం తిర్యగ్యోనిం సహస్రశః | యా భర్తుర్నాపయేద్విత్తం జీవితం చ శుభాననే 84
సాపీదృశీమవస్థాం వై యాస్యత్యేవ న సంశయః | ఏవం జ్ఞాత్వానిశం రక్షేత్‌ పత్యుర్విత్తంచ జీవితం 85
పతిర్మాతా పితా విత్తం జీవితం చ గురుర్గతిః 86
ప్రయాతినారీ బహుభిః సుపుణౖః సహైవభర్త్రా స్వశరీరదాహాత్‌ || విష్ణోః పదం విత్తశరీరలుబ్ధా ప్రయాతి యామీం చ కుయోనిపీడామ్‌ || 87
ఇతి శ్రీ బృహన్నరదీయ పురాణోత్తరభాగే
మోహినీచరితే కాష్ఠీలాచరితం నామ

త్రింశత్తమో
%ధ్యాయ. మీరు భక్తితో ఈమె పాదసేవ చేయవలయును. ఈమె నా మొదటి భార్య. మీ ఇద్దరి కంటే పెద్దది. ఇట్లు నా భర్త చెప్పగా వారిద్దరు నా పాదములను గ్రహించిరి. సవతి భావమును, ఈర్ష్యను విడిచివేసిరి. అంతట సేవకులను పిలిచి నా భర్త ఇట్లు పలికెను. రాక్షసుని గుహనుండి నేను పొందిన సంపదను, రాజకుమారిని వివాహమాడినపపుడు పొందిన సంపదను మొత్తమును భక్తి భావతముతో తీసుకొనిరండు. ఆలస్యమును చేయకుడు. ఓ సేవకులారా? ఆ సంపదకంతటికి ఈమెయె యజమానురాలు. నా భర్తమాటతో సేవకులు త్వరగా ధనమును గొనివచ్చిరి. నా పతి ప్రీతితో దానినంతటిని నాకు సమర్పించెను. స్వచ్ఛమైన చిత్తముతో వస్త్రభూషణాదులచే సత్కరించి రాక్షసి రాజ పుత్రికలు చూచుచుండగనే పర్యంకమున నున్న నన్ను బిగియార కౌగలించి ఆధరమును చుంబించెను. ఇట్లు ఆశ్చర్యకరమగు భర్త చేసిన దేహవిత్తసమర్పణను, ఉల్లాసమును కలిగించు మాటలను, చేతితో చేసిన కుచమర్దనమును చూసి ఖడ్గముచే ఛేదింబడని గోవువలె నా ప్రాణములు నన్ను విడిచి పోయెను. తరువాత నేను యముడు విధించిన నరకయాతనను బహుదుఃకముతో అనుభవించి ఇపుడు కాష్ఠీలాగా పుట్టితిని. మరల నేను పశు జన్మనందెదను. ఇట్లు వేల జన్మలు ఎత్తగలను. ఇట్లు భర్తకు తన విత్తమును జీవితమును అర్పించని స్త్రీ ఇట్టి స్థితినే పొందగలదు. కావున ఇట్లు తెలిసి ఎల్లపుడు భర్త కొఱకే విత్తమును జీవితమును రక్షించవలయును. భర్తయే తల్లి, తండ్రి, ధనము, బ్రతుకు, గురువు, ఆధారము, ఎన్నో సుకృతములు చేసిన స్త్రీ మాత్రమే భర్తతో తన శరీరమును కూడా దహింపచేసి విష్ణు పదమును చేరును. విత్తమునందు దేహమునందు లోభముగల స్త్రీ యమలోకమును, దుష్ట జన్మలనందును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున కాష్టీరా చరితమును ముప్పది యవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page